ఈ ఏడాది టాలీవుడ్‌లో పెద్దగా భాజా భజంత్రీలు మోగకపోయినా… కొంత మంది స్టార్స్ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేశారు. చైతూతో విడిపోయిన తర్వాత.. రాజ్ నిడమోరుతో చెట్టాపట్టాలేసుకుని కనిపించిన సమంత.. గత ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. డిసెంబర్‌లో ఈ జంట వివాహం చేసుకుంది. అక్కినేని వారసుడు అఖిల్.. బ్యాచ్ లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి జూన్6న జైనబ్ మెడలో మూడు ముళ్లు వేశాడు.
Also Read : AKKI : హిట్టిచ్చిన హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న అక్షయ్ కుమార్.. కలిసొచ్చేనా?
నారా రోహిత్.. తన ప్రియురాలు, హీరోయిన్ శిరీషా లేళ్ల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఎన్టీఆర్ బావమరిది, మ్యాడ్ ఫేం నార్నే నితిన్, శివానీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అక్టోబర్ నెలలో ఈ జోడీలు ఒక్కటయ్యాయి. చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికాగోర్, అభినయ కూడా ఈ సంవత్సరమే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్- హరిణ్య రెడ్డిల పెళ్లి.. నవంబర్‌లో జరిగింది. పీపీపీ.. డుండుంలే కాదు… ఎంగేజ్ మెంట్ చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక సైలెంట్‌గా నిశితార్థం చేసుకున్నారని టాక్. అల్లు శిరీష్ కూడా ఈ ఏడాది ఎంగేజ్ మెంట్ టాస్క్ కంప్లీట్ చేశాడు. ఈ మార్చిలో శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక విజయ్- రష్మిక మ్యారేజ్ ఫిబ్రవరిలో జరగబోతుందని ఓ టాక్ నడుస్తోంది. ఈ సంవత్సరం టాలీవుడ్‌లో డివోర్స్ వార్తలు పెద్దగా లేనప్పటికీ.. బ్రేకప్ న్యూస్‌లు హల్ చల్ చేశాయి. మిల్కీ బ్యూటీ తమన్నా.. విజయ్ వర్మకు కటీఫ్ చెప్పింది. పెళ్లి ఊసెత్తగానే.. కెరీర్ అంటూ కథలు చెప్పడంతో విజయ్‌తో మూడేళ్ల ప్రేమకు సమాధి కట్టింది మిల్కీ బ్యూటీ. ఇక ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు ప్రకటించిన నివేత పేతురాజ్.. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. సోషల్ మీడియాలో నుండి అతడి ఫోటోలు డిలీట్ చేసి.. తమ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేసినట్లు చెప్పకనే చెప్పింది.
