సంక్రాంతి పండుగ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల పై జనాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. ప్రతివారంలాగే ఈ వారం కూడా వరుస సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.. ఒక తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈ వారం డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఏ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల కాబోతున్నాయి.. ఇందులో కావ్య తాపర్,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. అలాగే నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కూడా నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న గ్రాండ్గా విడుదల కాబోతోంది. అలాగే విష్ణు విశాల్ , విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా లాల్ సలామ్ సినిమా కూడా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది..
ఇక అలాగే ట్రూ లవర్ సినిమా కూడా అదే రోజూ విడుదల కాబోతుంది.. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో మణికందన్, గౌరీప్రియ, నిఖిలా శంకర్ నటించారు. ఆరేళ్ల ప్రేమ తర్వాత ప్రేమికులిద్దరూ విడిపోయారు. చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.. ఇక సైరన్ సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరవేశ్వరన్, కీర్తి సురేష్ నటించారు. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. సైరన్ ఫిబ్రవరి 16న థియేటర్లలోకి రానుంది. అయితే అందరి ఫోకస్ మాత్రం ఈగల్ సినిమా పైనే ఉంది.. మరి ఏ సినిమా ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..
