Site icon NTV Telugu

Tollywood Movies: ఈ వారం థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..

Moviess (2)

Moviess (2)

ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవ్వడం కామన్.. ఈ వారం కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి.. స్టార్ హీరోల సినిమాలు లేకపోయిన చిన్న సినిమాల హవా బాగానే ఉందని చెప్పాలి.. మూవీ ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకుంది.. అంతేకాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇక ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా..

అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటిస్తున్న మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా.. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు..

సుందరం మాస్టర్..

వైవా హర్ష చెముడు.. ఈ పేరు అందరికీ పరిచయమే.. ప్రస్తుతం ‘సుందరం మాస్టర్’ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివ్య శ్రీపాద కథానాయికగా నటించగా.. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. ఈ ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది..

సిద్ధార్థ్ రాయ్..

దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న సిద్ధార్థ్ రాయ్. యశస్వి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తన్వి నేగి కథానాయికగా నటిస్తుంది. కొత్తతరం ప్రేమకథతో రూపొందించిన ఈ ను ఫిబ్రవరి 23న అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి… సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

ముఖ్య గమనిక..

వేణు మురళీ ధర్ తెరకెక్కించిన ముఖ్య గమనిక. ఇందులో విరాన్ ముత్తం శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వ్సతున్న ఈ ను ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సైరన్..

జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందించిన సైరన్. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు..

ఈ సినిమాలు అన్నీ కూడా ఒకే రోజు విడుదల కాబోతున్నాయి.. ఏ సినిమా హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Exit mobile version