Balakrishna – Harish Shankar: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – మాస్ ఎంటర్‌టైనర్ల స్పెషలిస్ట్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో దాదాపు ఒక సినిమా ఫైనల్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఈ ప్రాజెక్ట్‌ను KVN ప్రొడక్షన్స్ నిర్మించబోతుందని టాక్ నడిచినా, ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటుందని టాక్.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి దారుణహత్య..
ప్రస్తుతం హరీష్ శంకర్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక.. ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమా భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారట. ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య స్టైలిష్ లుక్, హై-ఆక్టన్ సీన్స్‌తో హరీష్ శంకర్ సిగ్నేచర్ మాస్ టచ్.. ఈ కాంబో థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. గతంలో KVN ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెండి తెరపైకి రాబోతుందని సమాచారం. గతంలో సితార నాగ వంశీ – బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘దాకు మహారాజ్’తో సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇదే టీమ్ మరో భారీ హిట్‌ను సినిమాను ఈ బ్యానర్ రెడీ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ సక్సెస్‌తో టాప్ ఫామ్‌లో ఉన్నారు. అలాగే ఇతర ప్రాజెక్ట్స్ కూడా లైన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్‌తో సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అంశాలపై సినిమా ప్రేమికులతో పాటు బాలయ్య అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
READ ALSO: ShraddhaDas : గ్యాప్ వచ్చిన శ్రద్ద ఏ మాత్రం తగ్గట్లేదుగా.. అవే హొయలు..
