Site icon NTV Telugu

ఇవాళ భవానీపూర్‌ ఉపఎన్నిక ఫలితం..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్‌ ఉపఎన్నిక ఫలితం ఇవాళ వెలువడనుంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించారు. 24 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. ఈ ఉపఎన్నికలో దీదీ గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోలుగుతారు. దీంతో ఉపఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version