NTV Telugu Site icon

Today Stock Market Roundup 28-03-23: మీడియా ఇండెక్స్‌.. వరస్ట్‌..

Today Stock Market Roundup 28 03 23

Today Stock Market Roundup 28 03 23

Today Stock Market Roundup 28-03-23: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ మంగళవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. గ్లోబల్‌ మార్కెట్‌ల నుంచి సానుకూల సంకేతాలు అందటంతో ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో లాభనష్టాల నడుమ ఊగిసలాడాయి. సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ 57 వేల 550 లెవల్‌ వద్ద 100 పాయింట్లు కోల్పోయింది.

ఎన్‌ఎస్‌ఈ సూచీ 16 వేల 950 పాయింట్ల వద్ద టెస్టింగ్‌కి గురైంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు సున్నా పాయింట్‌ 7 శాతం పడిపోయాయి. నిఫ్టీలో మీడియా ఇండెక్స్‌ వరస్ట్‌ పెర్‌ఫార్మర్‌గా మిగిలిపోయింది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్స్‌ స్వల్ప లాభాలతో బయటపడ్డాయి. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ 8 శాతం ర్యాలీ తీయగా కళ్యాణ్‌ జ్యూలర్స్‌ షేర్‌ ధర 11 శాతం పతనమైంది.

read more: TCS New CEO Krithivasan: టీసీఎస్‌ CEOగా సరైనోడే. కృతివాసన్‌పై అందరిదీ ఇదే మాట

సెన్సెక్స్‌ స్వల్పంగా 40 పాయింట్లు తగ్గి 57 వేల 613 పాయింట్ల వద్ద ఎండ్‌ అయింది. నిఫ్టీ కూడా అతితక్కువగా 34 పాయింట్లు కోల్పోయి 16 వేల 951 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 11 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. మిగతా 19 కంపెనీలు నష్టాలను చవిచూశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాయి.

కళ్యాణ్‌ జ్యూలర్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నేలచూపులు చూశాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, స్పార్క్‌, టొరెంట్‌ పవర్‌, సీఎస్‌బీ బ్యాంక్‌ రాణించగా విజయ డయాగ్నాస్టిక్స్‌, రేమండ్‌ కంపెనీలు వెనకబడ్డాయి. 10 గ్రాముల బంగారం రేటు 73 రూపాయలు పెరిగి.. గరిష్టంగా 58 వేల 599 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి ధర 243 రూపాయలు తగ్గి.. అత్యధికంగా 69 వేల 683 రూపాయలు పలికింది.

క్రూడాయిల్‌ రేటు 59 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్‌ ముడిచమురు 6 వేల 37 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 24 పైసల వద్ద స్థిరపడింది.