ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ మంచి ఆటతీరును ప్రదర్శించాడు. టీమిండియాపై నాలుగు ఇన్నింగ్స్‌లలో (60, 8, 23, 22) 28.25 సగటుతో 113 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల ఘటనలతో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సామ్.. ఒక్క సిరీస్‌తో ఆస్ట్రేలియా అభిమానులకు క్రేజీ ప్లేయర్‌గా మారిపోయాడు. అతడి ఆటోగ్రాఫ్ కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. అయితే ఆటోగ్రాఫ్ కోసం ఓ అభిమాని చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సామ్ కొన్‌స్టాస్ ప్రాక్టీస్ కోసం లగేజీతో రోడ్డుపై వెళ్తున్నాడు. వెనకనే కారులో వచ్చిన ఓ అభిమాని అతడిని గుర్తుపట్టి రోడ్డు పక్కనే కారును ఆపాడు. కారును త్వరగా పార్క్ చేసి.. సామ్ ఆటోగ్రాఫ్ కోసం పరుగెత్తాడు. ఈ తొందరలో ఆ అభిమాని కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు. పార్క్ చేసిన ప్రదేశం ఏటవాలుగా ఉండటంతో.. కారు ముందుకు కదిలింది. దీన్ని గమనించిన అభిమాని.. వెంటనే వెనక్కి వచ్చి కారును అదుపుచేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కారు ముందు పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. చిన్నగా తాకడం వల్ల ముందున్న కారుకు కూడా డామేజీ కాలేదు.
Also Read: CM Revanth Reddy: నేటి నుంచి సీఎం విదేశీ పర్యటన.. భారీ పెట్టుబడులే లక్ష్యం!
ఈ ఘటన జరిగిలోపే సామ్ కొనస్టాస్ మైదానంలోకి వెళ్లిపోయాడు. దాంతో ఆ అభిమాని ఆటోగ్రాఫ్ తీసుకోలేకపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా తెలియరాలేదు. ఏదేమైనా అభిమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తృటిలో ఆటోగ్రాఫ్ మిస్ అయ్యావ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా తదుపరి పర్యటనలో శ్రీలంకతో తలపడనుంది. లంకలో టెస్ట్, వన్డే సిరీస్ ఆడనుంది. జనవరి 29 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం కానుంది.