Tim David: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్‌పై సాధించిన ఉత్కంఠభరిత విజయం తర్వాత మరో వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ మ్యాచ్ ముగిసిన అనంతరం భావోద్వేగానికి లోనై అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో RCB చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో టిమ్ డేవిడ్ మిడిల్ ఫింగర్ చూపించినట్లు కనిపించడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయి అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. టిమ్ డేవిడ్ గత మూడు సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. 2025 ఐపీఎల్ వేలంలో అతడిని RCB సొంతం చేసుకుంది. మాజీ జట్టుపై జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో తన ప్రదర్శనతో మెరవాలని భావించిన డేవిడ్ మాత్రం నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. తొలి బంతికే వికెట్ కోల్పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడి హావభావాలు కూడా అదే విషయాన్ని తెలుపుతుంది. వైరల్ వీడియోలో కనిపించిన చర్యపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కొంతమంది అభిమానులు “అది అసహనం వల్ల వచ్చిన రియాక్షన్ మాత్రమే” అంటుండగా.. మరికొందరు “అంత పెద్ద ప్లేయర్ ఇలా ప్రవర్తించడం సరైంది కాదు” అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు టిమ్ డేవిడ్ లేదా RCB యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భువనేశ్వర్ కుమార్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో RCBకి అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో సిక్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన భువీ.. బౌలింగ్‌లో కూడా నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
All were busy with Virat Kohli’s celebration, see how Tim David celebrated 😂🔥 pic.twitter.com/0ApBaRNKNJ
— Middle Stump Cricket (@MiddleCricket) May 11, 2026
