Site icon NTV Telugu

Tillu Square Trailer: ఎలా పడతావ్‌రా టిల్లు ఇలాంటి జంబల్హాట్ లేడీస్‌ని?

Tillu Square Trailer

Tillu Square Trailer

Tillu Square Release Trailer: గతేడాది ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’గా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్‌‌ను అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ‘డీజే టిల్లు’కు సీక్వెల్‍గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయేలా చేశాయి. ఇక సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందు ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ తో కూడా అంచనాల పెంచేసే ప్రయత్నం చేసింది సినిమా యూనిట్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మార్కస్ చెప్పు అని టిల్లు అంటుంటే మార్కస్ తిన్నావా అన్న అని అడుగుతాడు, దానికి పెట్టిర్రు ఇప్పుడే పెద్ద ముద్ద అని అంటే దానికి మార్కస్ మల్లనా అన్న..అంటూ వేసే డైలాగ్ తో షురూ ఆయింది.

Siddharth Marriage: షూటింగ్ అని పర్మిషన్.. పంతుళ్లను పంపేసి సీక్రెట్‌గా పెళ్లి?

కారులో తనను తీసుకుపోతున్న క్రమంలో టిల్లు ఫాధర్ మళ్ళా ఏ పంచాయితీలా ఇరుక్కున్నావ్రా అడిగిన వెంటనే అనుపమతో రొమాన్స్ చూపించడం హైలైట్. ఒక రకంగా టిల్లు అనుపమతోనే పంచాయితీ పెట్టుకున్నట్టు చూపించారు. అంతే కాదు ప్రతిసారి ఎక్కడ పడతావ్ రా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ని అంటూ ప్రిన్స్ డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగడమే కాదు సినిమా మీద అంచనాలు పెంచే విధంగా సాగింది. ఈ సినిమాకు రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై టిల్లు స్క్వేర్ సినిమాను నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు.

Exit mobile version