NTV Telugu Site icon

Tillu Square : 100కి దగ్గరైన టిల్లు గాడు.. రంగంలోకి యంగ్ టైగర్..

Tillu Ntr

Tillu Ntr

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్’.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో రూపొందిన ఈ సీక్వెల్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. 100 కోట్లకు చేరువలో ఉంది.. ఇప్పటికే 96 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది.. సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది..

ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా మేకర్స్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ రాబోతున్నాడని మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. టిల్లు గాడి సినిమా ఎన్టీఆర్ కు తెగ నచ్చేసిందన్న విషయం తెలిసిందే.. మొన్నీమధ్య ఎన్టీఆర్ తన ఇంట్లో టిల్లు గాడికి గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి..

సినిమా సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చి మూవీ యూనిట్ అంతా అభినందించబోతున్నారు. ఏప్రిల్ 8న ఈ సక్సెస్ మీట్ ని నిర్వహించబోతున్నట్లు టిల్లు నిర్మాతలు పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు.. ఎప్పుడెప్పుడు టిల్లుతో ఎన్టీఆర్ ను చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.. ఇకపోతే టిల్లు 3 కూడా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి..

Show comments