TikTok Ban in US: భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ చైనీస్ వీడియో యాప్ టిక్ టాక్(TikTok) ను అమెరికా ప్రభుత్వం నిషేదించింది. త్వరలోనే ఈ మేరకు ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే యాప్ నిషేదం దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజులలో వినియోగించకూడదని నిర్ణయించింది ప్రభుత్వం. అందుకు సంబంధించిన నియమనిబంధనలను విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ ను వినియోగించే అవకాశాన్ని కోల్పోనున్నారు.
Read Also: Omicron BF7 : చైనా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్.. అలెర్టైన ప్రభుత్వం
బీజింగ్‌కు చెందిన బైట్‌డాన్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన టిక్‌టాక్‌ను వినియోగించడంతో భద్రతా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. దీంతో ముందస్తు చర్యల్తో భాగంగా ప్రభుత్వ పరికరాల నుండి నిషేధించడానికి అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారమే టిక్ టాక్ సాయంతో అమెరికన్లను ట్రాక్ చేయడానికి, కంటెంట్‌ను సెన్సార్ చేయడానికి చైనా ప్రభుత్వం యాప్‌ను ఉపయోగించవచ్చనే ఆందోళనలతో 19 రాష్ట్ర ప్రభుత్వాలు.. గవర్నమెంట్ కు చెందిన డివైజ్ లలో మాత్రమే యాప్ ను వినియోగించకుండా పాక్షికంగా బ్లాక్ చేశాయి. దేశ వ్యాప్తంగా యాప్ వాడకుండా నిషేదం అమలుచేయాలని యూఎస్ చట్ట సభ సభ్యులు ప్రతిపాదనలు తెస్తున్నారు. కొత్త రూల్ గురించి టిక్‌టాక్ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు.
Read Also:PM Modi Mother Hiraba: మోడీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు