Site icon NTV Telugu

Tiger Nageswara Rao : థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. వైరల్ అవుతున్న పోస్టర్..

Whatsapp Image 2023 10 11 At 11.42.47 Am

Whatsapp Image 2023 10 11 At 11.42.47 Am

టాలీవుడ్‌ స్టార్ హీరో మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం టైగర్‌ నాగేశ్వర రావు. ఈ చిత్రంతో యంగ్ డైరెక్టర్ వంశీ డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్‌ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి థర్డ్‌ సింగిల్‌ ఇచ్చేసుకుంటాలే సాంగ్ లుక్‌ ను విడుదల చేశారు.. ఈ పాటను అక్టోబర్ 12న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ పోస్టర్ లో రవితేజ బీడి కాలుస్తూ..తలపాగా చుట్టుకొని కొంచెం సీరియస్‌గా కనిపిస్తుంటే.. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్‌ తన ప్రియుడి ఒడిలో వాలిపోయి ఉంటుంది.. ఈ సినిమా లో నుపుర్ సనన్‌ సారా పాత్ర లో నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన సారా లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌లో గూస్‌ బంప్స్ తెప్పించే రవితేజ విజువల్స్‌ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.అలాగే రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్‌ మరో ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్‌ నటి రేణూదేశాయ్‌ హేమలత లవణం పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.

Exit mobile version