వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పోటీపై క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు. రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలని ఉండెను.. కానీ మీ అభిమానం చూసిన తరువాత జిల్లా కోసం రాజకీయాల్లో ఉండాలని అనుకున్నానని తెలిపారు. మీ బిడ్డగా పది నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం నిర్ణయం మార్చుకున్నానన్నారు. ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తిమేరకు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా పది నియోజకవర్గాలకు నలబై ఏళ్లుగా రేయింబవళ్లు సేవ చేశానని తెలిపారు. ప్రభుత్వాల సహకారంతో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చేసి జీవితాన్ని త్యాగం చేశానని తుమ్మల పేర్కొన్నారు. గోదావరి జలాలతో జిల్లా ప్రజల పాదాలు కడిగి రాజకీయాల్లో నుంచి వెళ్లి పోతానని సీఎంకు చెప్పానన్నారు.
Supreme Court: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ సెప్టెంబర్ 1 వరకు పొడిగింపు
ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిదని.. సుదీర్ఘ రాజకీయ అవకాశాలు ఇచ్చారని తుమ్మల తెలిపారు. తాను ఎన్నోసార్లు కిందపడ్డానని.. అయినప్పటికీ రాజకీయంగా ఖమ్మం ప్రజలే బ్రతికించారని అన్నారు. మీ ప్రేమ కోసం గోదావరి జలాలు వచ్చే వరకు శాసనసభ్యుడుగా ఉంటానని తెలిపారు. తాను ఎన్నోసార్లు కిందపడ్డానని, అయినప్పటికీ తనను ఖమ్మం ప్రజలు రాజకీయంగా బతికించారన్నారు. అలాంటి మీ ప్రేమ కోసం, అనుబంధం కోసం, మీ ఆలోచన కోసం… ఆ గోదావరి జలాలతో మీ పాదాలు కడిగే వరకు ఎమ్మెల్యేగా ఉంటానన్నారు.
Visakhapatnam: హడలిపోతున్న వైజాగ్ వాసులు.. అది చిరుతా..? అడవి పిల్లా..?
తనకు రాజకీయాలు అవసరం లేదని, కానీ ఇప్పుడు మీకోసం రాజకీయ జీవితం అన్నారు. తనకు అహంకారం, అలంకారం, ఆధిపత్యం, అధికారం చలాయించడం కోసం పదవి అవసరం లేదని, తన జిల్లా ప్రజల చిరునవ్వు కోసం అవసరమన్నారు. తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేరుస్తానన్నారు. కొంతమంది పరాన్నబుక్కులు తనను తప్పించారని శునకానందం పొందుతున్నారని, కానీ నన్ను రాజకీయంగా మీరు బతికిస్తారని భావిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజల కోసం, మీ ప్రతిష్ఠ కోసం, మీ ఆత్మాభిమానం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఎన్నికల్లో నిలబడుతున్నానన్నారు. పాలేరు, వైరా, లంకా సాగర్, బేతుపల్లి ప్రాజెక్ట్ లలో నీళ్ళు నింపి మీ వద్ద సెలవు తీసుకుంటానని తెలిపారు.
Jubilee Hills Peddamma Temple: 2000 ఏళ్ళ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి Vlog
ఈ గడ్డపై ఎంతోమంది మహానుభావులు పుట్టారని, వారికంటే ఎక్కువగా నాకు అవకాశం వచ్చిందని, అందుకు ఈ జిల్లాకు, పని చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు. తనను తప్పించినందుకు ఎవరినీ నిందించదల్చుకోలేదని, ధర్మం కోసం.. మీ కోసం ఎన్నికల్లో నిలబడుతున్నానన్నారు. నన్ను మీ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారని ముందుకు వచ్చానన్నారు. తల నరుక్కుంటాను కానీ నా వల్ల ఎవరూ తలదించుకోవద్దన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని అన్నప్పటికి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మాత్రం స్పష్టం చేయలేదు. ఇక పోతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానని కూడా స్పష్టం చేయలేదు.