ఇండోనేషియాలో ఓ స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. పాఠశాల భవనం కూలిపోవడంతో డజన్ల కొద్దీ పిల్లలు శిథిలాలలో చిక్కుకున్నారు. ముగ్గురు విద్యార్థులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా, 91 మంది విద్యార్థులు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులకు సహాయక సిబ్బంది నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read:MP Mithun Reddy: ఒక ఉగ్రవాదిలా నన్ను జైల్లో పెట్టారు.. సీసీ కెమెరా పెట్టి విజయవాడ నుంచి చూశారు..!
ఇండోనేషియాలోని తూర్పు జావాలోని సిడోర్జో నగరంలోని అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. గంటల పాటు జరిగిన సహాయక చర్యల తర్వాత ఎనిమిది మంది విద్యార్థులను శిథిలాల నుండి బయటకు తీసి ఆసుపత్రిలో చేర్చారు. శిథిలాల కింద అనేక మృతదేహాలను గుర్తించినట్లు సహాయక సిబ్బంది పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది విద్యార్థులు ఏడు నుండి పదకొండు తరగతులు చదువుతున్నారు ఉన్నారు. 12 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అధికారులు తెలిపారు.
