నేడు వెలబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ కూటమి రికార్డ్ స్థాయిలో స్థానాలను గెలుచుకుంది. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడంలో అనేక అంశాలు తోడ్పడ్డాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలో చేరడం, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తోడవడం లాంటి అనేక కారణాలు చాలానే ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సిపి ఇంత భారీ ఓటమిని చవి చూడడానికి కూడా కారణాలు లేకపోలేదు. అయితే అవి ఏంటో ఒకసారి చూస్తే..
Yusuf Pathan: ఆన్ ఫీల్డే కాదు ఆఫ్ ఫీల్డ్ లో కూడా విజయం సాధించిన టీమిండియా ఆటగాడు..
ఇక అసలు జగన్మోహన్ రెడ్డి ఇలా భారీగా ఓడిపోవడం గల కారణాల్లో మొదటగా.. వెనుకబడిన తరగతుల గురించి దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యవహరించిన విధానాలు తీవ్ర విమర్శలను ఎదుర్కొనేలా చేశాయి. అదేవిధంగా ఒకేసారి అసెంబ్లీ లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విధానంలో కూడా ఆయన వ్యూహం వర్కౌట్ కాలేకపోయింది. ముఖ్యంగా కొన్ని స్థానాలలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్తవారికి చోటు ఇవ్వడం లాంటి అనేక విషయాలు కూడా ఆయన ఓటమిలో కారణమైంది. 14 ఎంపీలు అలాగే 37 మంది ఎమ్మెల్యేలను ఆయన మార్చారు.
Amit Shah: 7 లక్షల ఓట్ల తేడాతో అమిత్ షా అఖండ విజయం..
ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు పై వచ్చిన సానుభూతి కూడా ఈ ఓటమికి కారణం అవ్వచ్చు. 2023 సెప్టెంబర్ నెలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఆరోపణలపై ఆయనను అరెస్టు చేయడంతో చంద్రబాబుపై ప్రజల్లో కాస్త సానుభూతి సెంటిమెంట్ ఏర్పడింది. ఇక మరో విషయానికి వస్తే.. కుల రాజకీయాల సంబంధించి కూడా వైఎస్ఆర్సిపికి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కమ్మ, కాపు ఓట్లను గెలుచుకోవడంలో వైఎస్ఆర్సిపి భారీగా ఫెయిల్ అయింది. ఇలా అనేక కారణాలు ఒక్కొక్కటిగా వైఎస్ఆర్సిపి పతనానికి దోహదం చేసింది. ఇక చివరిగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు కావలసిన కనీసం 18 స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోవడంతో వైఎస్ఆర్సిపి అభిమానులు తీవ్ర నిరాశల్లో ఉన్నారు.