Blood test scam : బ్లడ్ టెస్ట్ పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన భారత సంతతి వ్యాపారికి అమెరికా కోర్టు 13ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఇన్వెస్టర్లకు అబద్ధాలు చెప్పి మోసం చేసిన రమేశ్ సన్నీ బల్వానీకి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే తనతో పాటు కేసుతో సంబంధమున్న తన ప్రియురాలికి 11ఏళ్ల శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే..
థెరానోస్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేష్ ‘సన్నీ’ బల్వానీ తన కంపెనీ పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు చేసి చెప్పి లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బల్వానీ మాజీ ప్రియురాలు ఎలిజబెత్ హూమ్స్ 2003 లో రక్త పరీఓ స్టార్టప్ థెరానోస్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీలో రమేశ్ సన్నీ బల్వానీ వ్యాపార భాగస్వామిగా చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గా ఉన్నాడు. థెరానోస్ అనే సంస్థ రక్త పరీక్షల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
Read Also : National Wise Pending Cases: దేశంలో ఎన్ని పెండింగ్ కేసులున్నాయో తెలుసా..?
ఇన్వెస్టర్లను తన మోసపూరిత ప్రకటనలతో మోసం చేసి వారి నుంచి కోట్లలో నగదు రమేశ్ బల్వానీ తన ఖాతాలో వేసుకున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. 12 కేసుల్లో బల్వానీని నిందితుడిగా కోర్టు నిర్ధారించింది. ఇందులో 10 కేసులు మోసానికి సంబంధించినవి. కాగా, 2 కేసులు కుట్రకు సంబంధించినవి ఉన్నాయి. బల్వానీకి 15 ఏండ్ల శిక్ష విధించాలని, అతడి నుంచి రూ.6,000 కోట్లు పరిహారంగా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్ డిమాండ్ చేశారు. ఈ కేసును కోర్టు ఇంకా విచారిస్తున్నది. తదుపరి విచారణను ప్రస్తుతానికి వాయిదా వేసింది.
