ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సరిహద్దు్ల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. పోలింగ్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో పలు పార్టీల నాయకులు గ్రామాల్లో నగదు పంచేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. పోలీసులు ఎన్నికల విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా నాయకునగూడెం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు నిలుపకుండా వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు పది కిలోమీటర్లు చేజింగ్ చేస్తున్న క్రమంలో కారు పల్టీకొట్టింది. అందులు రూ.కోటిన్నర నగదు బయటపడింది.
READ MORE: Pakistan : పీఓకేలో అదుపు తప్పిన పరిస్థితి.. ఒక పోలీసు మృతి, 90 మందికి పైగా గాయాలు
ఖమ్మం పోలీసుల వివరాల ప్రకారం.. రాష్ట్ర రాజధాని నుంచి ఖమ్మం వైపునకు ఓ ఇన్నోవా వెళ్తోంది. నాయకనగూడెం వద్ద పోలీసులు తనిఖీ లు చేస్తుండగా ఇన్నోవా కారు ఆపితే ఆగకుండా వెళ్లింది. సిబ్బందికి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేశారు. పది కిలోమీటర్ల మేర పోలీసులు వాహనాన్ని తరిమారు. ఈ క్రమంలో దేవుడి తండా వద్ద ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణం చేసిన ఒకరికి గాయాలు కాగా ఆ వాహనంలో కోటిన్నర రూపాయలు పైగా నగదు బయట పడింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ కు తక్కువ సమయం ఉండటంతో ఇలాంటి ఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉంది. ఈ 40 గంటలు మాత్రం పోలీసుల గస్తీ పెంచనున్నారు. ఎన్నికలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.