Site icon NTV Telugu

Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ కు రీ రికార్డింగ్ చేయనున్న ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

Whatsapp Image 2024 03 18 At 2.43.17 Pm

Whatsapp Image 2024 03 18 At 2.43.17 Pm

స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్… ఈ నెల 29న థియేటర్లలోకి విడుదల అవుతోంది. క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా వస్తున్న  టిల్లు స్క్వేర్ మూవీ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ మూవీ ప్రచార చిత్రాలతో పాటు పాటలు కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ‘డీజే టిల్లు’ సినిమాకు ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు కూడా ఆయనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తారని అంతా భావించారు.కానీ, ‘టిల్లు స్క్వేర్’కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేస్తున్నారు. ఆ వర్క్ మీద ఆయన బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

‘టిల్లు స్క్వేర్’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు భీమ్స్ ప్రారంభించారు.’టిల్లు స్క్వేర్’ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ మరియు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాతలు తీసిన ‘మ్యాడ్’ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. అది మంచి విజయం సాధించింది. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ సినిమాను సైతం భీమ్స్ చేతిలో పెట్టారు.కెరీర్ స్టార్టింగ్ నుంచి భీమ్స్ సిసిరోలియో సూపర్ హిట్ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు. అయితే, ‘ధమాకా’ తర్వాత ఆయన ప్రతిభకు మరింత గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఆయన తో స్టార్ హీరోలు, అగ్ర దర్శక నిర్మాతలు పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు భీమ్స్ రీ రికార్డింగ్ చేస్తుండగా.. రామ్ మిరియాల మరియు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version