Site icon NTV Telugu

Britain: బ్రిటన్‌ యువరాణి మిడిల్టన్‌కు సీరియస్! నెట్టింట వార్తలు హల్‌చల్

Britain

Britain

బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు వార్తలు వ్యాపిస్తు్న్నాయి

డిసెంబర్‌ నుంచి కేట్‌ మిడిల్టన్‌ కనిపించడం లేదు (Kate Middleton missing). ఇటీవల ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో కేట్‌ మిడిల్టన్‌ కోమా(Coma)లోకి వెళ్లి ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి.

కేట్‌ మిడిల్టన్‌కు సర్జరీ అయిన విషయాన్ని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరి 17న వెల్లడించింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది. 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తెలిపింది. అయితే అప్పటినుంచి యువరాణి మాత్రం కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాప్తి చెందాయి.

సర్జరీ సమయంలో యువరాణికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలేనని పేర్కొంటున్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం కేట్‌ కనిపించకుండా పోయారనే వార్తలు ఆగడం లేదు. ఆమె భర్త ప్రిన్స్‌ విలియం ఇటీవల పలు కార్యక్రమాల్లో ఒక్కరే పాల్గొనడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదిలా ఉంటే కేట్‌ త్వరలోనే ప్రజల ముందుకువస్తారని రాజకుటుంబ వర్గాలు చెబుతుండగా.. ఆమె పూర్తిగా కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టవచ్చని బ్రిటన్‌ మీడియా పేర్కొంటోంది.

Sr

Exit mobile version