The Hundred Men’s Champions: ది హండ్రెడ్ మెన్స్ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 16న లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ట్రెంట్ రాకెట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను మొదటిసారి కైవసం చేసుకుంది. వరుసగా 3 గ్రూప్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకున్న మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.. ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించి అద్భుతం సృష్టించి టైటిల్ కైవసం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో అనూరిన్ డొనాల్డ్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్రిస్ గ్రెగరీ 32, బెన్ డకెట్ 31 పరుగులు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు, సన్నీ బేకర్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్ టిమ్ సీఫర్ట్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసిన సీఫర్ట్.. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీనితో మరో రెండు బంతులు మిగిలిఉండగానే 98 బంతుల్లోనే మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 162/5 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
సీఫర్ట్ ఔటైన తర్వాత మాంచెస్టర్ కొంత తడబడింది. చివరి 9 బంతుల్లో 3 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలోనూ మ్యాచ్‌ను ఉత్కంఠగా మారింది. హెన్రిచ్ క్లాసెన్, మైఖేల్ బ్రేస్‌వెల్ వరుసగా ఔటవడంతో పరిస్థితి కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే లియామ్ డాసన్ కీలక సమయంలో భారీ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలుండగానే మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Tim Seifert smashed seven sixes in The Hundred finals 🤯
– look at the bowlers reaction 🤣😂 pic.twitter.com/D71GUegDUX
— JB (@93Yorker) August 17, 2026
ఈ విజయంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు టిమ్ సీఫర్ట్ ఫైనల్ హీరోగా నిలిచాడు. ఫైనల్‌లోనే కాకుండా మొత్తం టోర్నీలోనూ అతడు జట్టుకు కీలక బ్యాటర్‌గా రాణించాడు. ఈ సీజన్‌లో సీఫర్ట్ 234 బంతుల్లో 394 పరుగులు చేశాడు. 49.25 సగటుతో పాటు 168.37 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. మొత్తం 22 సిక్సర్లు బాదిన అతడు ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 80 పరుగులు. మాంచెస్టర్ జట్టు టైటిల్ విజయానికి ఓపెనర్ పాల్ వాల్టర్ కూడా కీలకంగా మారాడు. ఐడెన్ మార్క్రమ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన తర్వాత.. జోస్ బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
దీనితో పాల్ వాల్టర్‌ను ఓపెనింగ్‌లోకి తీసుకురావడం జట్టు విజయాల పరంపరకు బాటలు వేసింది. వాల్టర్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 247 పరుగులు చేసి 179 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడాడు. ద హండ్రెడ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ఇది తొలి టైటిల్. గతంలో వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ట్రోఫీని అందుకోలేకపోయింది. అయితే మూడో ప్రయత్నంలో ఛాంపియన్‌గా నిలిచింది.
FIRST TITLE FOR SUPER GIANTS FAMILY..!!
– MSG Won The Hundred trophy 🏆 pic.twitter.com/je53piKP8J
— VIKAS (@Vikas662005) August 17, 2026

