అందమైన ప్రకృతి.. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు.. అబ్బా ఇంకేముంది.. ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో తెగ ఎంజాయ్ చెయొచ్చు.. అలాగే ఇక్కడ మాత్రం మనకు నచ్చిన ఫుడ్ తింటుంటే ఉంటుంది మజా.. మామూలుగా ఉండదనుకోండి. అలాంటి ఓ అందమైన రెస్టారెంట్ లో ఘుమఘుమలాడే వంటలు తింటుంటే.. వచ్చే ఫీలింగే వేరప్పా.. ఇలాంటి అనుభూతిని పొందాలంటే మాత్రం చైనా దేశానికి వెళ్లాల్సిందే. హాట్‌పాట్ రెస్టారెంట్‌గా పిలవబడే పిపా యువాన్ రెస్టారెంట్.. చైనాలోని చాంగ్‌క్వింగ్ నగర సమీపంలో కొండ మధ్యలో.. అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో పదో, పాతికో మంది కాదు.. ఏకంగా ఒకేసారి 5 వేల 800 మంది భోజనం చేసేయొచ్చు.
Read Also: Anand Deverakonda: రష్మికతో రిలేషన్ గురించి అడిగిన రిపోర్టర్.. షాకిచ్చిన చిన్న దేవరకొండ
3 వేల 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 900కు పైగా టేబుళ్లు ఈ పిపా యువాన్ రెస్టారెంట్‌లో ఉన్నాయి. అయితే, ఇక్కడ ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రెస్టారెంట్‌లో మనకు బుక్ అయిన టేబుల్ ఏదో తెలుసుకోవడానికి కనీసం ఓ పావుగంటైనా టైమ్ పడుతుంది.. మరి.. ఈ టేస్టీ వంటలను రుచిచూడాలంటే ఆ మాత్రం టైం వేచిచూడక తప్పదు అనుకోండి. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్‌లో లభిస్తాయి.
Read Also: AP Cabinet Decisions: ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక అంశాలకు ఆమోదం
చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ పిపా యువాన్ రెస్టారెంట్ లో లభిస్తాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు, 25మంది క్యాషియర్లతో పాటు వందల మంది క్లీనింగ్ సిబ్బంది ఇక్కడ డ్యూటీ చేస్తారు.. ఇంకో విషయం చెప్పడం మరిచిపోయానండి.. అయితే, ఈ రెస్టారెంట్ 24 గంటల పాటు తెరిచే ఉంటుందండోయ్. ముఖ్యంగా రాత్రిళ్లు ఇక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యుత్‌లైట్ల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత బ్యూటిఫుల్ గా కనిపించడమే దీనికి కారణమని రెస్టారెంట్ నిర్వహకులు చెబుతున్నారు.
