NTV Telugu Site icon

Maharastra : పెళ్లాన్ని వదిలిపెట్టాలని కొడుకుపై సలసల కాగే నీళ్లలో కారం కలిపి చల్లిన తల్లి

New Project (90)

New Project (90)

Maharastra : మహారాష్ట్రలోని థానేలో ఓ తల్లి తన సొంత కొడుకుపై పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అతడి పై సలసల కాగే నీళ్లను పోసింది. అంతకు ముందు ఆ నీటిలో ఎర్రటి కారం కూడా కలిపింది. దీనంతటికీ కారణం ఆమెకు తన కోడలు నచ్చలేదు. తన కొడుకు తన భార్యను విడిచిపెట్టాలని ఆమె కోరుకుంది. కానీ కొడుకు అందుకు ససేమీరా అన్నాడు. ఇది ఇష్టం లేని తల్లి కొడుకు తినడానికి కూర్చున్న సమయంలో కారంపొడి కలిపిన వేడినీళ్లను కొడుకుపై పోసింది.

ఉల్హాస్‌నగర్‌లోని బద్లాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ సాయి వాలావలి గ్రామంలో మోహన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని తల్లి, భార్య కూడా తనతోనే ఇంట్లో కలిసి ఉంటున్నారు. మోహన్ తల్లికి కోడలు అంటే ఇష్టం లేదని తెలుస్తోంది. కోడలు వచ్చాక ఇంట్లో గొడవలు మొదలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో పాటు ఇంట్లో కూడా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. మోహన్ తల్లి దీనంతటికీ తన కోడలే కారణమని ఆరోపిస్తుంది.

Read Also:Medicine Prices Hike: పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచో తెలుసా..?

అందుకే కొడుకును తన భార్యను విడిచిపెట్టాలని మోహన్‌ను పలుమార్లు కోరింది. కానీ మోహన్ అందుకు సున్నితంగా నిరాకరించాడు. శుక్రవారం మోహన్ భార్య ఏదో పని నిమిత్తం మార్కెట్‌కు వెళ్లింది. అప్పుడు అతని తల్లి మోహన్ ను కూర్చో, నేను నీకు భోజనం తెస్తాను అని చెప్పింది. నమ్మిన మోహన్ తినడానికి కూర్చున్నాడు. కానీ అతనికి తర్వాత తల్లి ఇలా చేస్తుందని తెలియదు. మోహన్ తల్లి తన కొడుకును తన భార్యను విడిచిపెట్టమని మళ్లీ కోరింది. ఈ విషయమై తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది.

అప్పుడు మోహన్ తల్లి ఒక పాత్రలో వేడినీరు తెచ్చింది. అందులో అప్పటికే చాలా కారం కలిపింది. తర్వాత ఆ నీటిని మోహన్‌పై పోసింది. వేడి నీటికి మోహన్ శరీరం మొత్తం కాలిపోయింది. నొప్పి కారణంగా అతను కేకలు వేయడం ప్రారంభించాడు. మోహన్ గొంతు విని ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చారు. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మోహన్ చికిత్స పొందుతున్నాడు. ‘నీ భార్య అన్నీ నాశనం చేసింది.. వదిలెయ్’ అని కోపంతో ఒక్కటే చెబుతోందని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. ఘటన అనంతరం మోహన్ భార్య తన అత్తపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలన్నారు. అలాగే మోహన్ తల్లిని అరెస్టు చేయాలని ఇరుగుపొరుగు వారు డిమాండ్ చేశారు.

Read Also:IPL 2024 LSG vs PBKS: లక్నో సూపర్ జెయింట్స్ మొదటి విజయాన్ని అందుకుంటుందా..?!