Site icon NTV Telugu

Paetongtarn Shinawatra: మరో రెండు వారాల్లో ఎన్నికలు.. మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని అభ్యర్థి

Thailand

Thailand

Paetongtarn Shinawatra: థాయ్‌లాండ్‌లో మరో రెండు వారాల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉన్న పెటోంగ్‌టార్న్ షినవత్రా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రతిపక్ష ఫ్యూ థాయ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న 36 ఏళ్ల రాజకీయవేత్త ఆసుపత్రి నుండి ఫోటోతో సోషల్ మీడియాలో తన కొడుకు పుట్టినట్లు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో తనకు బలం వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతానని చెప్పారు. ఆ పిల్లవాడికి ఫ్రితాసిన్ సుక్సావత్ అని పేరు పెట్టారు. ఈ నవజాత శిశువు ఆమెకు రెండో సంతానం.

ప్రసవానికి ముందు, 36 ఏళ్ల పెటోంగ్‌టార్న్ షినవత్రా నిండు గర్భిణి అయినప్పటికీ ఆమె ఎన్నికల కోసం తీవ్రంగా ప్రచారం చేసింది. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారు.కానీ వీడియో కాల్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉన్నారు. పెటోంగ్‌టార్న్ షినవత్రా ప్రస్తుతం పోల్స్‌లో లీడింగ్‌లో ఉన్నారు. ధాయ్‌లాండ్‌ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. షినవత్రా కుటుంబం పేరు, పార్టీ శాశ్వత ప్రజాదరణ కారణంగా ఆమెకు చాలావరకు కలిసిరానుంది. రెండు వారాల వ్యవధిలో 500 మంది సభ్యులున్న దిగువ సభలో ఆమె అత్యధిక సీట్లు గెలుస్తారని అంచనా.

Read Also: New York: న్యూయార్క్‌లో బైబ్యాక్ కార్యక్రమం.. గిఫ్ట్‌కార్డుల కోసం తుపాకులను వదిలేశారు..

ఆమె బిలియనీర్, మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాచిన్న కుమార్తె. అవినీతికి సంబంధించిన కేసులపై 2006లో సైనిక తిరుగుబాటు ద్వారా ఆయన అధికారం నుంచి తొలగించబడ్డాడు. సోమవారం ఒక ట్వీట్‌లో.. తక్సిన్‌ షినవత్రా తన మనవడు, అతని ఏడవ మనవడు పుట్టినందుకు ఆనందంగా ఉన్నానని అన్నారు. ”నేను విదేశాల్లో ఉండాల్సి ఉండగా నా ఏడుగురు మనవళ్లూ పుట్టారు. వచ్చే జూలైలో నాకు దాదాపు 74 ఏళ్లు వచ్చినందున నా మనవళ్లను చూసుకోవడానికి తిరిగి రావడానికి నేను అనుమతి అడగవచ్చు,” అని రాశారు.
రాజకీయంగా అల్లకల్లోలంగా ఉన్న రాజ్యంలో ఆమె తండ్రి మాత్రమే కాదు, ఆమె అత్త కూడా గతంలో ప్రధానిగా పనిచేశారు. జైలు శిక్షలను తప్పించుకోవడానికి ఆమె కూడా విదేశాల్లో నివసిస్తుంది. సార్వత్రిక ఎన్నికలు మే 14న జరగనుండగా, ప్రచారం చివరి దశకు చేరుకుంది.

 

Exit mobile version