Site icon NTV Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGSRTC లో 198 పోస్టులకు నోటిఫికేషన్

Tgsrtc Recruitment 2026

Tgsrtc Recruitment 2026

TGSRTC Recruitment 2026: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (TSLPRB) గురువారం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఖాళీగా ఉన్న కీలక పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ – 84 , మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ – 114, మొత్తం 198 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతం అందుకోనున్నారు. అలాగే వారికి ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

అర్హతలు..
* ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు – ఏదైనా డిగ్రీ.
* మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు – సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ తప్పనిసరి.

ఎంపిక విధానం..
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తిగా మెరిట్ ఆధారంగా జరగనుందని బోర్డు స్పష్టం చేసింది. అధికారిక నోటిఫికేషన్‌లో పరీక్ష విధానం, సిలబస్, ఫిజికల్ టెస్టుల వివరాలు ఇచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

దరఖాస్తు వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2025 డిసెంబర్ 30 ఉదయం 8 గంటల ప్రారంభమై, 2026 జనవరి 20 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Exit mobile version