Site icon NTV Telugu

TGPSC: గ్రూప్-III సర్వీసెస్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల..

Tgpsc

Tgpsc

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్-III సర్వీసెస్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,388 పోస్టులకు గాను.. ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థుల ఎంపిక జాబితాను వెల్లడించింది. గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచింది. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల తుది తీర్పుకు లోబడి ఈ ఫలితాల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒక్క ఖాళీని (01 Vacancy) ప్రస్తుతం విత్‌హెల్డ్ (Withheld) లో ఉంచింది కమిషన్. తప్పుడు వివరాలు సమర్పించినట్లు తేలితే ఎంపికను రద్దు చేస్తామని కమిషన్ హెచ్చరించింది. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-III పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Exit mobile version