NTV Telugu Site icon

TG Lok Sabha Result 2024: ఇప్పటి వరకు లీడ్ లో ఎవరు ఉన్నారంటే..

Tg Lok Sabha Result 2024

Tg Lok Sabha Result 2024

TG Lok Sabha Result 2024: సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యంలో ఉంది. మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 వేల ఓట్ల లీడ్ లో దూసుకుపోతుంది. హైదరాబాద్‌లో 59 వేల ఆధిక్యంలో ఎంఐఎం, వరంగల్‌లో 92,726 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ ముందంజలో ఉండగా.. భువనగిరిలో లక్షా 6 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌, చేవెళ్లలో 70 వేల ఓట్ల లీడ్‌లో బీజేపీ, జహీరాబాద్‌లో 17 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, పెద్దపల్లిలో 50 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌, నిజామాబాద్‌లో 39 వేల ఆధిక్యంలో బీజేపీ, కరీంనగర్‌లో లక్షా 13 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, ఖమ్మంలో 2.66 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ దూసుకుపోతుంది. ఇక మహబూబ్ నగర్ లో తొమ్మిదవ రౌండ్ తర్వాత 9,758 ఓట్ల మెజార్టీతో బీజేపీ ముందంజలో ఉంది. డీకే అరుణ.. 1,56,868 ఓట్లు మెజార్టీ రాగా.. 1,47,110 ఓట్లు చల్లా వంశీ చంద్ రెడ్డి ఉన్నారు.

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 28 వేల ఆధిక్యంలో ఉన్నారు. ఐదవ రౌండ్ తర్వాత మల్లు రవి ఆధిక్యంలో ఉన్నారు. మల్లు రవి.. 1,09,075 కాగా.. బీజేపీ భరత్ 97,617 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌ RS ప్రవీణ్ 90,561 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 286237 ఓట్లు మెజార్టీతో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 482046 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌ కు 195809 ఓట్లు, బీజేపీ 74206 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ 9 వ రౌండ్ ఫలితం తరువాత బీజేపీ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ ఆత్రం సక్కు .57566 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆత్రం సుగుణ. 182394 ఓట్లు వచ్చాయి. బీజేపీ గోడెం నగేష్.230779 ఓట్లు నమోదయ్యాయి. 9 వ రౌండ్ ముగిసే సరికి 48385 ఓట్లు మెజార్టీతో బీజేపీ లీడ్ ఉంది.
AP Elections Results 2024: ఓటమి దిశగా వైసీపీ కీలక నేతలు!