Site icon NTV Telugu

Anganwadi Centers: అంగన్వాడి కేంద్రాలకు మొట్ట మొదటిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?

Anganwadi Centers

Anganwadi Centers

అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి అక్టోబర్ నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఉండనున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read:AP Politics : జగన్ ను సైకోగాడు అన్నందుకు బాలకృష్ణపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్

మొట్ట మొదటిసారిగా అంగన్వాడీలకు దసరా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసిన ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు. వారి విజ్ఞప్తి మేరకు 8 రోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది తెలంగాణ ప్రభుత్వం. తమకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version