Site icon NTV Telugu

TG SSC Supplementary Result 2025: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

Tg Icet Result

Tg Icet Result

తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. టీజీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతము 73.35గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు మొత్తం 42,834 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోగా అందులో 38,741 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 28,415 మంది విద్యార్థుల ఉత్తీర్ణులయ్యారు. బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 71.05, బాలికల ఉత్తీర్ణతా శాతము 77.08గా ఉంది.

Also Read:Xiaomi AI Glasses: 12MP కెమెరా, AI అసిస్టెంట్‌ తో.. షియోమి నుంచి AI స్మార్ట్ గ్లాసెస్‌ విడుదల..

బాలికలు, బాలుర కంటే 6.03 % అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జనగామ జిల్లా అన్ని జిల్లాల కంటే 100 శాతము ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ ఉత్తీర్ణత శాతము అనగా 55.90 సాధించి చివరి స్థానములో ఉంది. ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version