Site icon NTV Telugu

Telugustop: తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ప్రారంభం..మీ లోకల్ వార్తలు సులభం!

Telugu Stop Launched

Telugu Stop Launched

Telugustop mobile app launched:ఎప్పటికప్పుడు తెలుగు వెబ్ పాఠకుల అభిరుచులకు అనుగుణంగా సమగ్రమైన వార్తా విశేషాలు అందిస్తూ, రాజకీయ- సినిమా బ్రేకింగ్ న్యూస్ లు మాత్రమే కాదు వైరల్, వింతలు విశేషాలు, లోతైన విశ్లేషణలతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వెబ్ మీడియాలో టాప్ రేసులో telugustop.com ముందుకు వెళుతోంది. ఇక పాఠకులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్తగా వార్త విశేషాలను అందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే వస్తున్న తెలుగు స్టాప్ ఇప్పుడు వెబ్ ద్వారానే కాకుండా మొబైల్ ద్వారాను ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ను తెలుసుకునే విధంగా ఒక యాప్ సిద్ధం చేసింది. అయితే హైపర్ లోకల్ కాన్సెప్ట్ తో ఈ యాప్ సిద్ధం చేశారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని తాజాగా అందించే ప్రయత్నం మొదలు పెట్టిందని చెప్పొచ్చు.

Sree Leela: అందమే అమ్మాయైతే నువ్వా!!!

అందులో భాగంగానే తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను తాజాగా ప్రారంభించింది. ఈ యాప్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించగా తెలుగు స్టాప్ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు ఆధ్వర్యంలో న్యూస్ రైటర్స్ టీమ్ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం పాఠకులకు అందిస్తూ వస్తుండగా ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా పాఠకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసున్నారు. ఇక తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం తెలుగుస్టాప్ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింక్ క్లిక్ చేయండి, తెలుగు వార్త విశేషాలు, లోకల్ వార్తలు సులభంగా తెలుసుకోండి
👉👉 తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
లేదా తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version