Site icon NTV Telugu

TGTET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

Tgtet 2025

Tgtet 2025

TGTET 2025 : తెలంగాణ ప్రభుత్వం విద్యాభ్యాస లక్ష్యంగా ప్రతి ఏడాది నిర్వహించే టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ఎంతో కీలకమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించవచ్చు.

ఈ ఏడాది టెట్ పరీక్షలు జూన్ 15 నుండి 30 మధ్య నిర్వహించనున్నారు. అధికారికంగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అప్లికేషన్‌ ఫారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

పరీక్ష వివరాలు
ఈసారి టెట్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ మోడ్ లో నిర్వహించనున్నారు. అంటే అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రాసాల్సి ఉంటుంది.

టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్ 1: ప్రాథమిక స్థాయి టీచర్ల (Class 1 to 5) కోసం.

పేపర్ 2: ప్రాథమికోన్నత స్థాయి టీచర్ల (Class 6 to 8) కోసం.

అభ్యర్థులు ఒక్క పేపరుకి గానూ రూ. 750 ఫీజు చెల్లించాలి.

రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి.

ఫలితాల విడుదల
తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష ఫలితాల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హతను నిర్ధారిస్తారు.

అభ్యర్థులకు సూచనలు
విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి, అవసరమైన అర్హతలు, వయోపరిమితి, ఫీజు వివరాలు, పరీక్షా విధానం తదితర వివరాలు తెలుసుకొని మాత్రమే దరఖాస్తు చేయాలి. అలాగే, పరీక్షకు అవసరమైన సిలబస్‌ను బట్టి ముందుగానే సిద్ధమవ్వడం మంచిది.

Exit mobile version