Telangana Loan: తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్న వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించింది. బహిరంగ మార్కెట్ రుణాలు, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల వివరాలను మొత్తం బయట పెట్టేసింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పులు రూ.75,577 కోట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 2.83 లక్షల కోట్లకు పెరిగాయని… 2022 అక్టోబర్ నాటికి రూ.4.33 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఈ మొత్తం… రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలే రూ. 1.3 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.
Read Also: Dhananjay Munde : 101జేసీబీలు, 10టన్నుల పూలు.. గ్రాండ్ ఎంట్రీ అదిరిందయ్యా
నాబార్డ్ నుండి రుణాలు తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు
– నాబార్డ్ నుండి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వంకు ఇప్పటివరకు 7144 కోట్ల రుణాలు
– వేర్ హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నాబార్డ్ నుండి ఇప్పటివరకు 85,227.94 కోట్ల రుణాలు తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు
– నాబార్డ్ నుండి ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ కింద సుమారు 1007.10 కోట్లు రుణం తీసుకున్న తెలంగాణా ఇండస్ర్టీయల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్
– ఇన్ఫ్రాస్ట్లక్చర్ డెవలప్ మెంట్ అసిస్టెన్స్ కింద నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వ కార్పొరేషన్లకు 11,424.66 కోట్ల రుణాలు
Read Also:LTTE Chief Prabhakaran: ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. త్వరలోనే బయటికి వస్తాడు
తెలంగాణ అప్పుల గురించి ఇంత డీటైల్‌గా చెప్పిన కేంద్రం.. ఏపీ అప్పులపై బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణం గురించి మాత్రం పూర్తి వివరాలు ఇవ్వదు. ఏపీ అప్పులపై కేవలం ఆర్బీఐ తీసుకున్న రుణాల వివరాలే ఇస్తుంది. వీటిని చూపించి వైసీపీ నేతలు.. తాము తక్కువ శాతమే అప్పు చేశామని ప్రకటిస్తూ ఉంటారు. నిజానికి ఏపీ అప్పు రూ.పది లక్షల కోట్లకు దగ్గర అయిందని గణాంకాలు చెబుతున్నాయి.