Site icon NTV Telugu

Telangana Municipal Results: మున్సిపాలిటీల్లో హస్తం, కారు, గులాబీ పరిస్థితి ఇదే..

Results

Results

Telangana Municipal Results: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల తుది ఫలితాలు వెలువడ్డాయి. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ లెక్కిం కొనసాగుతోంది. కొన్ని మున్సిపాలిటీల తుది ఫలితాలు ఇప్పటికే వచ్చేశాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కొనిపిస్తోంది. మిగితా ఫలితాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాల్లో మరి కొన్ని గంటల్లో రానున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలు మున్సిపాలిటీ వారీగా ఇలా ఉన్నాయి.

నందికొండ మున్సిపాలిటీ – కాంగ్రెస్ ఘన విజయం
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం 12 వార్డుల్లో 11 వార్డులను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇది ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ బూస్ట్‌గా మారింది.

గడ్డపోతారం మున్సిపాలిటీ – బీఆర్‌ఎస్‌ ఆధిపత్యం
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగిరింది. 18 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 14 వార్డులను కైవసం చేసుకుని పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. కాంగ్రెస్‌ 3, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు.

తొర్రూరు (మహబూబాబాద్) – బీఆర్‌ఎస్‌ విజయం
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ 16 వార్డుల్లో 9 స్థానాలు దక్కించుకుని విజయాన్ని సాధించింది. కాంగ్రెస్‌ 6 వార్డుల్లో గెలుపొందింది.

దేవరకద్ర – నో మ్యాజిక్ ఫిగర్
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో హంగ్ పరిస్థితి నెలకొంది. 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, ఇతరులు 1 గెలవడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది.

నేరేడుచర్ల – కాంగ్రెస్ జయకేతనం
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 15లో 9 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీని దక్కించుకుంది. బీఆర్‌ఎస్‌ 5, ఇతరులు 1 స్థానంలో గెలిచారు.

కోహీర్ మున్సిపాలిటీ – పోటీ సమతుల్యం
సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కాంగ్రెస్‌ 16లో 8 వార్డులను గెలుచుకుంది. బీఆర్‌ఎస్‌ 5 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో వార్డు గెలుచుకున్నారు.

అయిజ – బీఆర్‌ఎస్‌ సత్తా
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ 20లో 13 వార్డులు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. కాంగ్రెస్‌ 7 స్థానాల్లో విజయం సాధించింది.

మరిపెడ – కాంగ్రెస్ ఆధిపత్యం
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్‌ 15లో 8 వార్డులు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 6, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.

సుల్తానాబాద్ – కాంగ్రెస్ పైచేయి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కాంగ్రెస్‌ 15లో 12 వార్డులు గెలుచుకుని ఘన విజయం సాధించింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఇతరులు ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నారు.

డోర్నకల్ – హస్తం జయభేరి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో కాంగ్రెస్‌ 15లో 11 వార్డులు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీఆర్‌ఎస్‌ 4 స్థానాలు గెలిచింది.

హాలియా – కాంగ్రెస్ హవా
నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్‌ 12లో 8 వార్డులు గెలుచుకుని మున్సిపాలిటీని దక్కించుకుంది. ఇంకా కొన్ని స్థానాల లెక్కింపు కొనసాగుతోంది.

అశ్వారావుపేట – కాంగ్రెస్ భారీ విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 22లో 17 వార్డులను గెలుచుకుని ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ 2, బీజేపీ 1 స్థానాలు దక్కించుకున్నాయి.

 

Exit mobile version