ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్, మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ ప్రారంభం కానుంది. 23 రోజుల్లో పూర్తి ప్రకియ జరగనుంది. అయితే పదవీ విరమణ 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ జరగనుందని తెలిపింది.