తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలను కైవసం చేసుకుని.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకని ఒక సీటులో మాత్రమే పోటీ చేసిన సీపీఐ.. విజయం సాధించింది. దాంతో కాంగ్రెస్ ,మొత్తంగా 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ తొలిసారి జెండా ఎగురవేయనుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 65 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరికాసేపట్లో సీఎల్పీ నేతను నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఒక్కక్కరిగా గెలిచిన అభ్యర్థులు ఒక్కక్కరిగా చేరుకొంటున్నారు.
మొత్తం 119 సీట్లకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐలు కలిసి 65 సీట్లను గెలవగా.. అధికార బీఆర్‌ఎస్ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది.