NTV Telugu Site icon

TS EdCET : టీఎస్ ఎడ్ సెట్ 2023 షెడ్యూల్ విడుదల

Ts Edcet

Ts Edcet

TS EdCET : తెలంగాణ ఎడ్​సెట్​ 2023 నోటిఫికేషన్​విడుదలైంది. అప్లికేషన్లతో పాటు, ఎగ్జామ్​ తేదీల షెడ్యూల్​ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ​ఈసారి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ పరీక్ష​నిర్వహిస్తుంది. తెలంగాణ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్. లింబాద్రి, టీఎస్ ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్, మ‌హాత్మాగాంధీ వ‌ర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి క‌లిసి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. మే 18న ఎడ్​సెట్​ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు ఈ ఎంట్రన్స్​ నిర్వహిస్తారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు బీఈడీ ఎంట్రన్స్​ రాసేందుకు అర్హులు. భవిష్యత్తులో టీచర్​ జాబ్ సాధించాలనుకునే వారందరూ బీఈడీ, లేదా డీఈడీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Read Also: Maheshwar Reddy : మా మధ్య ఏం లేదు.. బాంబు పేల్చిన మహేశ్వరరెడ్డి

అభ్యర్థులు ఈ నెల 6నుంచి ఆన్​లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఏప్రిల్​ 20వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. లేట్​ ఫీతో ఏప్రిల్​ 25వ తేదీ వరకు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మే 5వ తేదీ నుంచి ఆన్​లైన్​లో హాల్​టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ ప‌రీక్ష నిర్వహించి, 21న ప్రాథ‌మిక కీ విడుద‌ల చేయ‌నున్నారు.