DOST Notification: దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడుతల్లో అడ్మిషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOST Notification: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్‌లోని డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అడ్మిషన్ ప్రక్రియ మూడు రౌండ్లలో నిర్వహించనుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంపిక చేయనుంది. రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Read also: CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్
Also Read
1. మొదటి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు మే 6న ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు.జూన్ 3న సీట్లు కేటాయిస్తారు.జూన్ 4 నుంచి 10 వరకు విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలి.
2. రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4న ప్రారంభమవుతుంది. 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 4 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు చేసుకోవచ్చని.. జూన్ 18న సీట్లు కేటాయిస్తారని, సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24లోగా ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలని సూచించారు.
3. చివరి మూడవ విడుత రిజిస్ట్రేషన్ జూన్ 19న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 25 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని.. అదే నెల 19 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చని తెలిపారు. జూన్ 29న సీట్లు కేటాయిస్తారు.అదే రోజు నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలి. ఇదిలా ఉండగా మూడో విడుత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
అయితే.. గతేడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా 1,054 కాలేజీలు దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను ఆయా డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.
CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!