Site icon NTV Telugu

Telangana Budget: సామాన్యులకు గుడ్‌న్యూస్.. ప్రతి ఫ్యామిలీ సేఫ్టీకి రూ.5 లక్షలు.. బడ్జెట్‌లో 5 కొత్త పథకాలు ఇవే..

Bhatti

Bhatti

Telangana Budget 2026-27: అసెంబ్లీలో రూ.3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రవేశ పెట్టారు. 2026-27 ఏడాదికి గానూ 3,24,234 కోట్లు అంచనా వేశారు. 2026-27 తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం నూతన పథకాలను ప్రతిపాదించింది.

1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం:
జూన్ 2, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తారు.

2. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం:
2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావతో కూడిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు.

3. ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం:
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఇకపై మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తారు.

4. సి.ఎం. ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం:
రాష్ట్ర యువతకు విదేశాలలో సురక్షితమైన ఉపాధి, భాషా నైపుణ్యాలు, వీసా మార్గదర్శకత్వం అందించడానికి ఈ కొత్త ప్రోగ్రాం

5. దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు:
ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ‘రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్’ వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

 

 

Exit mobile version