Tecno POP 9 5G Smartphone Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘టెక్నో’.. భారత మార్కెట్లో తన మార్క్ చూపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రీమియం ఫోన్‌లతో సహా బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. టెక్నో పాప్ 7, కెమన్ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసిన టెక్నో.. తాజాగా ‘పాప్ 9’ 5జీని తీసుకొచ్చింది. 10 వేలకే లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మంచి కెమెరా, బిగ్ బ్యాటరీ ఉంది. టెక్నో పాప్ 9 ఫోన్ డీటెయిల్స్ తెలుసుకుందాం.
టెక్నో పాప్ 9 5జీ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ఆరంభం అయ్యాయి. రూ.499 టోకెన్ చెల్లించి ప్రీ బుకింగ్స్ చేసుకోవచు. అక్టోబర్ 7 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రెటైల్స్ స్టోర్‌లలో ఇది అందుబాటులో ఉంటాయి. అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్‌నైట్ షాడో రంగులలో అందుబాటులో ఉంటుంది.
Also Read: Flipkart Offers: రూ.1కే ఆటో రైడ్.. ఎగబడుతున్న జనం!
టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది వస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఐపీ 58 రేటింగ్‌తో వస్తుంది. 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్ 582 రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 18 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.