తెలుగు దేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. మూడో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలి.. రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించాలంటూ ఆయన అన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశంపై మీనమేషాలు లెక్కించడం సరికాదు అంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలో వెల్లడించారు.
Read Also: SA vs NED: ధర్మశాలలో వర్షం.. నెదర్లాండ్-సౌతాఫ్రికా మ్యాచ్ ఆలస్యం
ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఎంసెట్ రాస్తుంటారు అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పటి వరకు ప్రతేడాది 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది అర్ధాంతరంగా 2 కౌన్సెలింగ్ లకే పరిమితం చేశారు.. తమకు నచ్చిన కళాశాలలో సీటు, ఎంచుకున్న కోర్సు రాలేదని.. చాలా మంది 2, 3 కౌన్సెలింగ్ లకు వరకు వెళ్తుంటారు ని ఆయన చెప్పారు. కానీ.. విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. 3వ కౌన్సెలింగ్ క్యాన్సిల్ చేసి, స్పాట్ అడ్మిషన్లకు మాత్రమే అనుమతిస్తామని చెప్పడం సరికాదు అంటూ టీడీపీ ఎంపీ ఆరోపించారు. ఇది కేవలం కళాశాలల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చేదే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వెంటనే ఇలాంటి చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో 3వ విడద కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.