Site icon NTV Telugu

Vijayawada: వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. మ్యాన్‌హోల్‌లో పడి టీడీపీ నేత మృతి..!

Person Died

Person Died

Vijayawada: విజయవాడలో నిన్న రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసి వదిలేసిన మ్యాన్ హోల్ ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది.. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విజయవాడ నగరం గులాం మొహిద్దిన్‌ స్ట్రీట్‌లో నగరపాలక సంస్థ అధికారులు మ్యాన్‌ హోల్‌ను తవ్వారు. దీనిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడంలో వీఎంసీ వైఫల్యం చెందింది. మ్యాన్‌ హోల్‌ ఉందనే హెచ్చరిక బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు.

READ MORE: Dil Raju : ఫెడరేషన్తో చివరి దశ చర్చలు!

మంగళవారం రాత్రి భారీ వర్షానికి ఈ మ్యాన్‌ హోల్‌ వర్షపు నీరుతో నిండిపోయి కనిపించలేదు. దీంతో అటుగా వచ్చిన 53వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్‌ ఆ మ్యాన్‌ హోల్‌ లో పడ్డారు. స్థానికులు అతడిని బయటకు తీయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయినా లాభం లేకుండా పోయింది. అప్పటికే మధు మృతి చెందారు. ఈ అంశంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మ్యాన్‌ హోల్‌ ఉందనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా.. ఓ నిండు ప్రాణం పోయేది కాదని స్థానికులు చెబుతున్నారు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

READ MORE: Poco M7 Plus 5G: 7,000mAh బ్యాటరీ, 50MP రియర్ కెమెరా.. మిడ్ రేంజ్ ఫోన్స్ బాప్ ఆగయా!

Exit mobile version