NTV Telugu Site icon

Tata Nano EV: టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..!

Nano

Nano

సామాన్యులు కూడా కార్లలో తిరుగాలనే ఉద్దేశ్యంతో కేవలం లక్ష రూపాయలకే కారును అందించింది టాటా కంపెనీ. టాటా నానో పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే.. ఆ కారుకు అనుకున్నంత ఆదరణ లభించకపోవడంతో కొన్ని రోజులకు కార్ల తయారీని నిలిపివేసింది. అయితే.. మళ్లీ రీలాంఛ్ చేసేందుకు కంపెనీ యోచిస్తుంది. అది కూడా ఎలక్ట్రికల్ కారు.. టాటా నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు అధికమవుతున్నాయి. ఈ కారు 2024 చివర్లో లాంఛ్ అవుతుందని.. ధర, మైలేజ్, ఫీచర్స్, మోడల్ ఇలా ఉంటుందంటూ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ కారుకు సంబంధించి విశేషాలేంటో తెలుసుకుందాం..

Read Also: Fake IAS: ఐఏఎస్‌ అని చెప్పి పెళ్లి.. భార్యను నమ్మించి రూ.2 కోట్లు వసూలు చేశాడు..!

నానో ఎలక్ట్రికల్ కారు ఫీచర్స్ :
ఈ కారుకు నాలుగు డోర్లు, 4 సీట్లు ఉంటాయి. ఇక.. బ్యాటరీ విషయానికొస్తే.., 17 kWh బ్యాటరీ ఉండనుందట. దీనికి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల మైలేజ్.. R12 profile టైర్లు, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే.. 3.3 kW, AC charger, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రికల్ కారును లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందట. అయితే.. ఈ కారు బేసిక్ ధర రూ. 5 లక్షలు ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాల సమాచారం. హైఎండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం టాటా టియాగో ఈవీ కారుకు ప్రారంభ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 11.50 లక్షల వరకు నడుస్తుంది. ఈ కార్ల అమ్మకాలు మంచిగా సేల్ అవుతుండటంతో.. 10 లక్షల లోపు నానో ఎలక్ట్రికల్ కారు తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈవీ చిన్న కార్లలో ప్రస్తుతానికి ఎంజీ ఎలక్ట్రికల్ కామెట్ ఉంది. దీని ధర రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంది. ఇదే ప్రైస్ లో నానో ఈవీని తీసుకొచ్చేందుకు టాటా కంపెనీ భావిస్తోంది.