Site icon NTV Telugu

Keedaa Cola : ఓటీటీలోకి వచ్చేచేస్తున్న తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2023 12 06 At 2.39.10 Pm

Whatsapp Image 2023 12 06 At 2.39.10 Pm

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘కీడా కోలా’.ఈ సినిమాలో బ్రహ్మనందం, చైతన్య మందాడి మరియు రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఐదేళ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించగా.. తొలి రోజు నుంచే ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది.తరుణ్ భాస్కర్ టైమింగ్ కామెడీ తో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులని ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచింది.ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో ‘కీడా కోలా’ సినిమా డిసెంబర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే మేకర్స్ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయితే ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఓటీటీ లో చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక ‘కీడా కోలా’ సినిమా కథ విషయానికి వస్తే.. వాస్తు(చైతన్యరావు) అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. అందులోంచి బయటపడాలంటే అతనికి డబ్బు అవసరం. అలాగే సినిమాలో మరో క్యారెక్టర్ జీవన్‌(జీవన్‌కుమార్‌)అనుకోకుండా అవమానాలపాలవుతాడు. ప్రతీకారం తీరాలంటే అతను కార్పొరేటర్‌ కావాలి. దానికీ కూడా డబ్బే అవసరం. వాస్తు తన తాత వరదరాజులు(బ్రహ్మానందం)కోసం తెచ్చిన శీతలపానీయంలో బొద్దింక కనిపిస్తుంది. ఎలాగూ డబ్బు అవసరం కాబట్టి వారు దీన్నే అదనుగా తీసుకొని, లీగల్‌గా ప్రొసీడవుతామని సదరు శీలత పానీయం కంపెనీవారిని బెదిరించి డబ్బుగుంజుదామని వాస్తు మిత్రుడు మరియు న్యాయవాది అయిన కౌశిక్‌(రాగ్‌మయూర్‌) సలహా ఇవ్వడంతో అసలు కథ మొదలవుఉంది. ఇక జీవన్‌ విషయానికొస్తే.. తన అన్న నాయుడు(తరుణ్‌భాస్కర్‌) జైలునుండి విడుదలవ్వడంతో అన్న అండతో ఎలాగైనా కార్పోరేటర్‌ అవుదామని ఆశపడతాడు. కానీ దానికి కూడా డబ్బే అవసరం కావడంతో వాళ్లు కూడా ఓ ప్లాన్ వేస్తారు.ఇంతకీ జీవన్‌ అతని అన్న వేసిన ప్లాన్ ఏంటి..శీతలపానీయం కంపెనీవాళ్లను బెదిరించి వాస్తు అండ్‌ బ్యాచ్‌ డబ్బులు తీసుకోగలిగారా అనేది సినిమా కథ..థియేటర్స్ లో ఆకట్టుకున్న కీడా కోలా ఓటీటీ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందో లేదో చూడాలి..

Exit mobile version