Site icon NTV Telugu

Ajith : అజిత్ కొత్త వ్యాపారం.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్

Thala Ajith Valimai first look update soon with a release date

Ajith : హీరో అజిత్ గురించి పరిచయం చేయనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు అభిమానులున్నారు. అజిత్ కు బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. నిత్యం బైక్ పై వందలు.. వేల కిలో మీటర్ల తిరుగుతూ తన రికార్డులను తానే తిరగ రాసుకుంటుంటాడు. ఆయన బైక్ రైడింగ్ ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలను టచ్ చేస్తూ ఒక భారీ మెగా బైక్ రైడ్ మొదలు పెట్టాడు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ.. తాజాగా ఇంకో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. బైక్ రైడింగ్ కు సంబంధించిన వ్యాపారంలో అజిత్ అడుగు పెట్టబోతున్నాడు. ఏకే మోటో రైడ్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి ఔత్సాహిక మోటో రైడర్స్ కి సహకారం అందిస్తూ ఉంటారు.

Read Also:Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతి పై క్రిమినల్ కేసు

చాలా మందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ వారికి సరైన బైక్ లేకపోవడంతో పాటు ఎక్కడ బైక్ రైడ్ చేస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందనే విషయాలు తెలియక మొదలు పెట్టి కొన్నాళ్లకే ఆపేస్తూ ఉంటారు. ఇప్పుడు అజిత్ కుమార్ ఏర్పాటు చేసిన ఏకే మోటో రైట్స్ వల్ల ఎవరైతే బైక్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఉందో వారికి అన్ని విధాలుగా సర్వీస్ అందజేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా బైక్ రైడ్ చేసిన అనుభవజ్ఞులు గైడ్ లు గా ఏర్పాటు చేసుకుని ఔత్సాహికులు బైక్ రైడింగ్ చేయవచ్చు. ఇందు కోసం బైక్ రైడర్స్ భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త వ్యాపారంలో కచ్చితంగా అజిత్ సక్సెస్ అవుతాడు అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:BRO : ఏంటి ‘బ్రో’ ఇది… ఐటమ్ సాంగ్ కు ఆ స్టార్ హీరోయినా ?

Exit mobile version