NTV Telugu Site icon

Tamannaah Bhatia: ఆధ్యాత్మిక సేవలో మిల్క్ బ్యూటీ.. ఫోటోలు వైరల్..

Whatsapp Image 2024 01 25 At 6.49.43 Am

Whatsapp Image 2024 01 25 At 6.49.43 Am

టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా సౌత్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ బడా హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. మిల్క్ బ్యూటీగా టాలీవుడ్, కోలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.. అయితే ఈ అమ్మడు భక్తురాలుగా మారిపోయింది…

తాజాగా ఓ ప్రముఖ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సాధారణంగా తమన్నాకు భగవంతుని పట్ల అపారమైన నమ్మకం, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి.. అందుకే ఎప్పుడు దేవాలయాలను సందర్శిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఇప్పుడు తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత కామాక్య ఆలయాన్ని సందర్శించింది… కామాక్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది తమన్నా.

ఈ సందర్భంగా పసుపు రంగు చుడీదార్, మెడలో హారం, శాలువా, నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషినల్‌గా కనిపించిందీ. ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలు గడిపాను’ అంటూ తమన్నా తన టెంపుల్‌ విజిట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇకపోతే ఇషా ఫౌండేషన్‌లో జరిగిన శివరాత్రి, సంక్రాంతి, లింగ భైరవి దేవి పూజల్లో నటి తమన్నా భాటియా పాల్గొంది. అలాగే తన దైనందిన జీవితంలో ధ్యానం, యోగా , ప్రాణాయామం ఒక భాగంగా చేసుకుంది.. ఇషా ఫౌండేషన్‌లో జరిగిన శివరాత్రి, సంక్రాంతి, లింగ భైరవి దేవి పూజల్లో నటి తమన్నా భాటియా పాల్గొంది.. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి..