Site icon NTV Telugu

Talibans: తాలిబన్ల అరాచకం.. బహిరంగంగా దోషులు కాల్చివేత

Taliban

Taliban

అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో తాలిబన్ల అరాచకం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు బహిరంగంగా శిక్ష అమలుచేశారు. అందరూ చూస్తుండగానే ఇద్దరిని పిట్టల్లా కాల్చి చంపేశారు. ఈ ఘటన తూర్పు అఫ్గానిస్థాన్‌లోని ఓ ఫుట్‌బాల్‌ మైదానంలో చోటుచేసుకొంది.

రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. విచారణ చేపట్టిన అక్కడి సుప్రీంకోర్టు వీరికి మరణశిక్ష విధించింది. బహిరంగంగా శిక్షను అమలుచేయాలంటూ ఆదేశించింది. దీంతో ఫుట్‌బాల్‌ కోర్టులో అందరూ చేస్తుండగానే దోషులకు మరణదండన అమలు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ శిక్షను చూసేందుకు హాజరైన వేలాదిమందిలో దోషుల కుటుంబాలు కూడా ఉన్నట్లు పేర్కొంది.

ఉరిశిక్ష పడిన వీరిద్దరు సెయిడ్ జమాల్, గుల్ ఖాన్‌లుగా గుర్తించారు. ఇద్దరూ వరుసగా సెప్టెంబర్ 2017, జనవరి 2022లో హత్యలకు పాల్పడ్డారని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామిక్ చట్టం అమలుకు అనుగుణంగా ఉరిశిక్ష అమలు చేసేందుకు స్వయంగా బంధువులు కూడా అంగకీరించినట్లు తెలుస్తోంది.

Exit mobile version