అహ్మదాబాద్ లో జరిగిన ఎంపిక సమావేశం తర్వాత ఏప్రిల్ 30, మంగళవారం భారత టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి గడువు మే 1 న నిర్ణయించబడింది, కాకపోతే., మంగళవారం సమావేశం తరువాత బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం జరిగే ఎంపిక సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అతను లక్నోతో ముంబై ఇండియన్స్ మధ్య హోమ్ గేమ్ కోసం ముంబైలో ఉంటాడు.
ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ కలుసుకున్నట్లు సమాచారం. తుది జట్టును ఎంచుకోవడానికి తన సహచరులతో కూర్చునే ముందు కెప్టెన్ రోహిత్ తో మాట్లాడటానికి, మరింత స్పష్టత పొందడానికి కూడా అవకాశం లభిస్తుందని అగార్కర్ ఈ పర్యటన చేసినట్లు తెలిసింది. ఈ చర్చకు వచ్చే కొన్ని అంశాలు ఉన్నాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్లతో వికెట్ కీపర్ స్థానం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్ లో మంచి ప్రదర్శన కనబరిచారు.
జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానాన్ని పొందడానికి సంజు శాంసన్ కంటే కేఎల్ రాహుల్ ముందున్నాడని కూడా వార్తలు వచ్చాయి. జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కింది. పేర్కొన్న ఐదు పేర్లలో, బుమ్రా మరియు కుల్దీప్ మాత్రమే గొప్ప ఫామ్లో ఉన్నారు, అర్షదీప్, సిరాజ్ మరియు జడేజా వంటి వారు ఐపిఎల్ 2024 లో పెద్ద ప్రదషర్షణలు చేయలేకపోయారు. అయితే, జట్టులో అదనపు బౌలర్ స్థానం కోసం అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మధ్య త్రిముఖ పోరాటం జరిగే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రాగా., అతని స్థానం జాతీయ సెలెక్షన్ ప్యానెల్ కు ఆందోళనగా ఉంది. హార్దిక్ 9 మ్యాచ్ లలో 197 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 46. అదే సమయంలో, శివమ్ దూబే బ్యాట్ తో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, సిఎస్కె కోసం 9 మ్యాచ్లలో 350 పరుగులు చేశాడు.
