NTV Telugu Site icon

Swiggy: మొన్న న్యూ ఇయర్.. ఇప్పుడు ఐపీఎల్… స్విగ్గీకి కాసుల పంట

Swiggy

Swiggy

ఆకలేస్తుంది. అన్నమో.. లేదా ఏదో ఒక ఫుడ్ కావాలి. ఇంట్లో ఏమీ లేదు. వెంటనే మొబైల్ ఫోన్ తీసి ఆర్డర్ చేయడమే.. ఫుడ్ ను ఆర్డర్ చేసుకునేందుకు రకరకాల యాప్ లు ఉన్నాయి. కానీ ఫుడ్ యాప్ లలో ఫేమస్ మాత్రం స్విగ్గీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చేసిన ఆర్డర్ టైంకు తొందరగా వస్తుందనే నమ్మకం. ఇప్పుడు అదే ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గీ మరో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది.

Also Read : New SP office: వనపర్తిలో కొత్త ఎస్పీ ఆఫీస్ ను ప్రారంభించిన హోంశాఖ మంత్రి

మొన్నటికి మొన్న 2023 న్యూ ఇయర్ రాత్రి.. ఏకంగా 3.5 లక్షల బిర్యానీలు అమ్ముడు పోయాయని ప్రకటించిన స్విగ్గీ.. ఇప్పుడు దానికి రెట్టింపుగా 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని తెలిపింది. స్పెషల్ గా ఇన్ని ఆర్డర్లు ఎందుకోసం వచ్చాయనుకుంటున్నారా..? అదేనండి సోమవారం (మే 29) ఐపీఎల్ ఫైనల్ కదా.. అందుకని. అటు ఫైనల్ మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తూ.. ఇటు బిర్యానీలు ఆర్డర్ కొట్టారు. అసలే ఫైనల్ మ్యాచ్.. అందులో వరుణిడి ఆటంకం. ఇంకేముంది టెన్షన్ టెన్షన్. ఛలో ఏమైనా తిందామా.. ఏముంది బిర్యానీ. స్విగ్గీలో ఆర్డర్ చేయడం. ఇలా స్విగ్గీకి కాసుల పంట మరోసారి పడింది. ఏ ఐపీఎల్ సీజన్ లో రాని.. ఆర్డర్లు ఈ సీజన్ లో వచ్చినట్లు తెలిపింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. అయితే వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ అన్న దానిపై స్విగ్గీ స్పష్టత ఇవ్వలేదు. మరీ ఐపీఎల్ అంటే అట్లుంటది.

Also Read : Siddharth: తారక్, మహేష్.. మధ్యలో సిద్దార్థ్ ఎవడు.. వీడేం చేస్తున్నాడు అంటారు

మరోవైపు ఐపీఎల్ సీజన్ ను స్విగ్గీ బాగానే క్యాష్ చేసుకుంది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. ముంబయితో ఎలిమినేటర్ పోరులో లక్నో ఓడిపోవడంతో.. అబ్బాయిలూ టెన్షన్ పడకండి.. మేము లక్నోలో టిష్యూలను రీస్టాక్ చేయడం ప్రారంభించాం అంటూ ట్రోల్ చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల మ్యాచ్ పదే పదే ఆగిపోతుండటంపై అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారు? అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది. ఇలా క్రికెట్ ను, ఫుడ్ తో ముడిపెడుతూ ట్వీట్లు చేసింది.

Swiggy Tweet

Show comments