NTV Telugu Site icon

Suryakumar Ydav: పేపర్ ప్లేన్‌తో ఆడుకుంటున్న సూర్యకుమార్..వీడియో వైరల్

Syreu1

Syreu1

సూర్యకుమార్ యాదవ్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో నెంబర్‌వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. తనదైన ఆటతీరుతో అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అయితే న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం అంత గొప్పగా రాణించలేదు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 90 పరుగులే చేయగలిగాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 47 మాత్రమే. అయితే టీ20 క్రికెట్ ర్యాంకుల్లో మాత్రం తన నెంబర్ వన్ ర్యాంకును సూర్య కాపాడుకున్నాడు. కివీస్‌తో జరిగిన చివరి టీ20లో కూడా మంచి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగగా.. అతనికి మంచి సహకారం అందించాడు. కానీ 24 పరుగుల చేసి ఔటయ్యాడు.

అనంతరం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్.. బౌండరీ లైన్ వద్ద నిలబడ్డాడు. ఆ సమయంలో త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వాటర్ బాటిల్ తీసుకొని బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. అప్పటికే భారత విజయం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో అక్కడ కనిపించిన ఒక పేపర్ ప్లేన్ తీసుకొని దాంతో సూర్య ఆడుకున్నాడు. దాన్ని ప్రేక్షకుల వైపు విసిరాడు. అది చూసి రఘు కూడా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంత ఇంపార్టెంట్ మ్యాచ్‌లో కూడా అబ్బాయిలు ఇలాగే చిల్ అవుతారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఫర్వాలేదనింపించిన సూర్యకుమార్.. మళ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ తొలి టెస్టుకు దూరమవడంతో అతని స్థానంలో సూర్య ఆడతాడని సమాచారం. అయితే దీనిపై టీమిండియా నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఇంకా క్లారిటీ రాలేదు.

Also Read: Misbah Ul Haq: పీసీబీ నిర్ణయం సిగ్గుచేటు: మాజీ ప్లేయర్ విమర్శలు