Suriya 43 : ఆ స్టార్ హీరో రికార్డు బ్రేక్ చేసిన సూర్య మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నారు..ఈ మధ్యే సూర్య తన 43 వ సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ లో తెగ వైరల్ అవుతుంది..సూర్య 43 మూవీని సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) నేషనల్ అవార్డు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి… దీనితో సోషల్ మీడియా ఎక్స్ లో సూర్య43 అనౌన్స్‌మెంట్ వీడియో కు ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేసింది..
సూర్య 43ని అనౌన్స్ చేస్తూ అక్టోబర్ 26న సూర్య ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఇప్పటికే 2.65 కోట్ల వ్యూస్ వచ్చాయి..ఈ ప్లాట్‌ఫామ్ పై ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ వీడియో ఇదే. ఇప్పటి వరకూ దళపతి విజయ్ పోస్ట్ చేసిన వీడియో పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ వీడియోకు 2.62 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను విజయ్ గతేడాది డిసెంబర్ లో పోస్ట్ చేశాడు.అయితే సూర్య 43 అనౌన్స్‌మెంట్ వీడియో మాత్రం కేవలం రెండు వారాల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం . ఈ సినిమాలో సూర్యతోపాటు దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ వర్మ కూడా నటిస్తుండటం విశేషం. ఈ ముగ్గురూ సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే లియో మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న దళపతి విజయ్.. తన తరువాత మూవీ దళపతి 68 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!