తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ బాగా ఫెమస్ అయ్యింది.. ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా కూడా వెనక్కి తగ్గట్లేదు.. కామెంట్ చేసిన వారికి క్లాస్ ఇస్తూ అంతకు మించి వీడియోలను చేస్తున్నారు తల్లీ కూతుర్లు.. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది..
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన సమ్మోహనుడా అనే సాంగ్ వల్లే ఈ రేంజ్ లో పబ్లిసిటీ దక్కుతోంది..నేహా శెట్టి అందాలు ఆరబోస్తూ మతిపోగోట్టే డ్యాన్స్ తో ఈ సాంగ్ ఓ కవ్విస్తోంది. శ్రేయ ఘోషల్ మైకం తెప్పించే ఎంతో మధురంగా ఈ పాటని పాడింది. ప్రస్తుతం ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు, ప్రేక్షకులు అనే తేడా లేకుండా రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తల్లి కూతుళ్లు సురేఖ వాణి, సుప్రీతా మరోసారి వైరల్ అయ్యారు. సమ్మోహనుడా సాంగ్ కి వీరిద్దరూ అదరహో అనిపించేలా డ్యాన్స్ చేసి మెప్పించారు..
చీరకట్టులో సురేఖ వాణి, సుప్రీతా డ్యాన్స్ చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ కి మాత్రమే కాదు పాపులర్ అయ్యే ప్రతి వీడియోకి తల్లి కూతుళ్లు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక సుప్రీతా అయితే తన గ్లామర్ ఒలకబోసే విధంగా హాట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తోంది.. వీరిద్దరూ కూడా నిత్యం ఏదొక ట్రిప్ వేసుకుంటూ అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. సోదరి, తల్లి, వదిన లాంటి పాత్రలతో సురేఖ వాణి పాపులర్ అయింది.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో సురేఖ వాణి నటించింది..